Telugu Global
Cinema & Entertainment

Gopichand | ఫ్లాప్ దర్శకుడితో గోపీచంద్ సినిమా

Gopichand - దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు గోపీచంద్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Gopichand | ఫ్లాప్ దర్శకుడితో గోపీచంద్ సినిమా
X

గోపీచంద్ మలినేని కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా రాబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తారు.

ఇంతకుముందు గోపీచంద్-రాధాకృష్ణ కాంబోలో జిల్ అనే సినిమా వచ్చింది. రాధాకృష్ణకు అదే తొలి సినిమా. తన కెరీర్ లోనే మోస్ట్ స్టయిలిష్ గా గోపీచంద్ కనిపించిన సినిమా ఏదైనా ఉందంటే అది జిల్ మాత్రమే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు గోపీచంద్.

ప్రభాస్ తో రాధేశ్యామ్ అనే సినిమా చేశాడు రాధాకృష్ణ. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ప్రభాస్ కు ఏం కాలేదు కానీ, రాధాకృష్ణ కెరీర్ కు ఇబ్బందిగా మారింది. అటు పూజాహెగ్డే కు ఈ ఫ్లాప్ మరింత ఇబ్బందికరంగా మారింది. అలా కెరీర్ లో గ్యాప్ తీసుకున్న రాధాకృష్ణ, ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో కలిసి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అదేంటో.. ఈమధ్య ఫ్లాప్ దర్శకులందరికీ అవకాశాలిస్తున్నాడు గోపీచంద్. మొన్నటికిమొన్న మారుతి, శ్రీవాస్ లాంటి దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రాధాకృష్ణకు అవకాశం ఇచ్చాడు.

First Published:  20 Sep 2023 5:18 PM GMT
Next Story