Telugu Global
Cinema & Entertainment

Gopichand Malineni | బాలీవుడ్ లోకి గోపీచంద్ మలినేని

Gopichand Malineni - బాలీవుడ్ లో అడుగుపెట్టాడు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ తో సినిమా లాంచ్ చేశాడు.

Gopichand Malineni | బాలీవుడ్ లోకి గోపీచంద్ మలినేని
X

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ 2023లో 'గ‌ద‌ర్ 2' తో పెద్ద హిట్ కొట్టాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సన్నీ డియోల్ కు హిట్టిచ్చిన సినిమా ఇది. 4 దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 100 సినిమాల దిశగా దూసుకుపోతున్న సన్నీ డియోల్.. గోపీచంద్ మలినేనితో సినిమాకు ఓకే చెప్పాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ వై రవి శంకర్, నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా, ఈ సినిమాను నిర్మిస్తారు. క్రాక్, వీరసింహా రెడ్డి వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. హిందీలో ఈ దర్శకుడికి ఇదే తొలి సినిమా.

ఈరోజు హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. సన్నీ డియోల్ ఈ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.

సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

First Published:  20 Jun 2024 5:33 PM GMT
Next Story