Telugu Global
Cinema & Entertainment

Gopichand Malineni | రెగ్యులర్ షూట్ మొదలుపెట్టిన మలినేని

Gopichand Malineni - గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబోలో హిందీ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది.

Gopichand Malineni | రెగ్యులర్ షూట్ మొదలుపెట్టిన మలినేని
X

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలిసి సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. శనివారం నుంచి అధికారికంగా హైదరాబాద్‌లో షూట్ ప్రారంభమైంది. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా ఇది.

మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం ద్వారా మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించింది యూనిట్. సన్నీ డియోల్ తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టడంలో పాపులర్. బలమైన భావోద్వేగ కథనాలతో యాక్షన్‌ను చూపించడంలో గోపీచంద్ మలినేని దిట్ట. ఇప్పుడీ ఇద్దరూ కలవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

సయామి ఖేర్, రెజీనా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. సెన్సేషనల్ కంపోజర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్‌ చేస్తున్నాడు.

గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ చేస్తున్న రెండో సినిమా ఇది. 66 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ ఆయన ఫైట్స్ చేస్తున్నాడు. అతడి తమ్ముడు బాబీ డియోల్ కూడా రీసెంట్ గా యానిమల్ సినిమాతో క్లిక్ అయ్యాడు. ఇలా అన్నదమ్ములిద్దరూ మరోసారి బాలీవుడ్ లో పాపులర్ అయ్యారు.

First Published:  23 Jun 2024 2:01 AM GMT
Next Story