Telugu Global
Cinema & Entertainment

Bhimaa | కేక పుట్టిస్తుందంటున్న గోపీచంద్

Gopichand Bhimaa Movie - భీమా మూవీ కేక పుట్టిస్తుందంటున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో అతడు డ్యూయల్ రోల్ చేశాడు.

Bhimaa | కేక పుట్టిస్తుందంటున్న గోపీచంద్
X

హీరో గోపీచంద్ తాజా చిత్రం భీమా. ఈ సినిమాకి ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించి చాలా ప్రచారం జరుగుతోంది.

మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హన్మకొండ వరంగల్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకుల మధ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన గోపీచంద్, భీమా సినిమా కేక పుట్టిస్తుందని చెప్పుకొచ్చాడు.

"భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాత. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ, ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి."

గోపీచంద్ తో పాటు ఈ సినిమాలో పనిచేసిన చాలామందికి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. గోపీచంద్ కు కొన్నాళ్లుగా సక్సెస్ లేదు. మాళవిక శర్మ, ప్రియాభవానీ శంకర్ లకు బ్రేక్ లేదు. ఇక దర్శకుడికి ఇదే తొలి తెలుగు సినిమా.

First Published:  3 March 2024 7:08 AM GMT
Next Story