Telugu Global
Cinema & Entertainment

RRR Movie: గూగుల్ ట్రెండింగ్ లో ఆర్ఆర్ఆర్ కు చోటు

Google trending movies: ఈ ఏడాది గూగుల్ లో అత్యథికంగా ట్రెండ్ అయిన సినిమాల జాబితాను గూగుల్ ప్రకటించింది. ఈ టాప్-10 లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ మూవీకి అగ్రస్థానం దక్కలేదు.

RRR Movie Japan box office collections
X

RRR Movie Japan box office collections

గూగుల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది. భారత్ లో గూగుల్ ట్రెండింగ్స్ లో ఈ సినిమాకు నాలుగో స్థానం దక్కింది. మొదటి స్థానంలో బ్రహ్మాస్త్ర నిలిచింది.

భారతదేశంలో సినిమాలకు సంబంథించి ఎక్కువమంది ఏ మూవీని ట్రెండ్ చేశారని అంశానికి సంబంధించి నివేదిక విడుదల చేసింది గూగుల్. ఈ లిస్ట్ లో 2022 సంవత్సరానికి గాను బ్రహ్మాస్త్ర సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. బ్రహ్మాస్త్ర అనే హ్యాష్ ట్యాగ్ నే ఎక్కువమంది ట్రెండ్ చేసినట్టు, ఎక్కువ వారాలు ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచినట్టు ప్రకటించింది గూగుల్.

ఇక మోస్ట్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో కేజీఎఫ్2 నిలిచింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. అందుకు తగ్గట్టుగానే భారీగా ట్రెండ్ అయింది కేజీఎఫ్2 సినిమా.

ఇక లిస్ట్ లో మూడో స్థానంలో కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలిచాయి. నిజానికి ఈ ట్రెండింగ్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అగ్రస్థానంలో నిలుస్తుందని అంతా ఆశించారు. కానీ బ్రహ్మాస్త్ర సినిమా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గూగుల్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ఇలా ఉంది..

1. బ్రహ్మాస్త్ర

2. కేజీఎఫ్-2

3. ది కశ్మీర్ ఫైల్స్

4. ఆర్ఆర్ఆర్

5. కాంతార

6. పుష్ప

7. విక్రమ్

8. లాల్ సింగ్ చడ్డా

9. దృశ్యం2

10. థార్

First Published:  16 Dec 2022 6:15 PM GMT
Next Story