Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ కు సెన్సార్ క్లియరెన్స్

చిరంజీవి హీరోగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

గాడ్ ఫాదర్ కు సెన్సార్ క్లియరెన్స్
X

చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ 'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

'గాడ్ ఫాదర్' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై సినిమా తెరకెక్కుతోంది.

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. దసరా కానుకగా వచ్చేనెల 5న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది గాడ్ ఫాదర్. చిరంజీవి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు.

First Published:  24 Sep 2022 8:29 AM GMT
Next Story