Telugu Global
Cinema & Entertainment

రేపే గాడ్ ఫాదర్ డాన్స్ నంబర్

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రచారం ఊపందుకుంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి-సల్మాన్ కలిసి డాన్స్ చేసిన సాంగ్ ఇదే

రేపే గాడ్ ఫాదర్ డాన్స్ నంబర్
X

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి చేతులు కలిపారు. అంతకంటే ముందు వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌తో మెగా మాస్ ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైయింది.

చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా ఉంటుందంటున్నారు మేకర్స్. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో ఇద్దరూ అన్నదమ్ముల్లా కనిపించారు. ఒకే రకమైన దుస్తులు, బ్లాక్ షేడ్స్ తో మెగా స్టయిల్ చూపించారు.

తమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ ని కంపోజ్ చేయగా, ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. పాటలో హుట్ స్టెప్ ఉందనే విషయం ప్రోమో చూస్తే అర్థమౌతోంది. శ్రేయా ఘోషల్ ఈ పాటని ఆలపించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. రేపు ఫుల్ లిరికల్ వీడియో విడుదల చేస్తున్నారు.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.Next Story