Telugu Global
Cinema & Entertainment

Geethanjali Malli Vachindhi | స్మశాన వాటికలో టీజర్ లాంచ్

Geethanjali Malli Vachindhi - హీరోయిన్ అంజలి నటించిన 50వ చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను స్మశానంలో రిలీజ్ చేయబోతున్నారు.

Geethanjali Malli Vachindhi | స్మశాన వాటికలో టీజర్ లాంచ్
X

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్.

గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’లో హీరోయిన్ అంజలికి ఎంతో ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాదు, ఆమె కెరీర్‌ ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం.

ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. హారర్ చిత్రం కావటంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్‌ను ఇలా ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగటం ఇదే తొలిసారి.

First Published:  22 Feb 2024 5:20 PM GMT
Next Story