Telugu Global
Cinema & Entertainment

Geethanjali 2 | `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది`

Geethanjali 2 - సూపర్ హిట్ గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలైంది. ఇందులో కూడా అంజలి లీడ్ రోల్ పోషిస్తోంది.

Geethanjali 2 | `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది`
X

టాలీవుడ్ హిస్ట‌రీలో అంజ‌లి న‌టించిన `గీతాంజ‌లి` సినిమాను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న `గీతాంజ‌లి` సినిమాకు సీక్వెల్ సిద్ధ‌మైంది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ `గీతాంజ‌లి` సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేక‌ర్స్.

`గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` అనే పేరుతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వెన్నులో వ‌ణుకు తెప్పించే స్పైన్‌ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మొద‌లైంది. కోన వెంక‌ట్ స‌మ‌ర్పిస్తున్న సినిమా ఇది. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

అచ్చ తెలుగు అమ్మాయి అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా ఇది. ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయి స్టిల్ తో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

`గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి రామ‌చంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి అంద‌జేశారు. సినిమాలో శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంక‌ట్‌ కథ-స్క్రీన్ ప్లే అందించగా.., ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 Sep 2023 5:49 PM GMT
Next Story