Telugu Global
Cinema & Entertainment

Writer Padmabhushan: మరో చిన్న సినిమాకు 'గీతా' సపోర్ట్

Writer Padmabhushan: సుహాస్ హీరోగా నటించిన చిన్న సినిమా రైటర్ పద్మభూషణ్. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనే పెద్ద సంస్థ, ఈ చిన్న సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది.

Writer Padmabhushan: మరో చిన్న సినిమాకు గీతా సపోర్ట్
X

సుహాస్ హీరోగా నటించిన సినిమా 'రైటర్ పద్మభూషణ్‌'. ఇందులో స్ట్రగులింగ్ రైటర్ గా కనిపించనున్నాడు సుహాస్ తాజాగా 'రైటర్ పద్మభూషణ్' సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ముందుకొచ్చారు.

గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేసిన కాంతారా చిత్రం ఘనవిజయం అందుకుంది. కాంతారా ఘనవిజయం తర్వాత గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ 'రైటర్ పద్మభూషణ్‌' ని విడుదల చేస్తున్నారు. 'రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వస్తోంది.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కన్నుల్లో నీ రూపమే మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి వెంకట్ శాకమూరి సినిమాటోగ్రఫీ అందించాడు. కీలక పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, రోహిణి నటించారు.

First Published:  8 Jan 2023 2:44 AM GMT
Next Story