Telugu Global
Cinema & Entertainment

Weekend OTT | ఈవారం ఓటీటీలోకి మరో ఫ్లాప్ సినిమా

Gandeevadhari Arjuna - వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

Gaandeevadhari Arjuna Movie Review: గాండీవధారి అర్జున - మూవీ రివ్యూ!{1.5}
X

Gaandeevadhari Arjuna Movie Review: గాండీవధారి అర్జున - మూవీ రివ్యూ!{1.5}

ఓటీటీలోకి వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలొస్తున్నాయి. మొన్నటికిమొన్న భోళాశంకర్ వచ్చింది. అదే టైమ్ లో కింగ్ ఆఫ్ కొత్త, హిడింబ లాంటి సినిమాలు కూడా వచ్చేశాయి. ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ, ఇప్పుడు మరో ఫ్లాప్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ గాండీవధారి అర్జున. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, పెద్ద డిజాస్టర్ అయింది. విడుదలై వారం రోజులు కూడా ఆడలేదు ఈ సినిమా. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ భారీగా ఖర్చు చేసి నిర్మించాడు.

ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులముందుకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా సెప్టెంబర్ 24న ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మరి ఇతర భాషల డబ్బింగ్ వర్షన్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

నాజర్, వినయ్ రాయ్, అభినవ్ గోమఠం, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ముకేశ్ రాథోడ్ సినిమాటోగ్రఫి అందించాడు. థియేటర్ల నుంచి ఈ సినిమాకు పెద్దగా ఏం రాలేదు. కానీ నెట్ ఫ్లిక్స్ డీల్ తో నిర్మాత ప్రసాద్ గట్టెక్కిపోయాడు. అటు బయ్యర్లు మాత్రం బుక్కయిపోయారు.

First Published:  21 Sep 2023 11:09 AM GMT
Next Story