Telugu Global
Cinema & Entertainment

Gandeevadhari Arjuna | గాండీవధారి అర్జున ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Gandeevadhari Arjuna - వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ సినిమా మొదటి వారాంతం పూర్తి చేసుకుంది.

Gandeevadhari Arjuna | గాండీవధారి అర్జున ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
X

గతేడాది గని రూపంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు వరుణ్ తేజ్. అతడి కెరీర్ లో అప్పటివరకు అదే బిగ్గెస్ట్ ఫ్లాప్. మళ్లీ ఆ రేంజ్ లో ఫ్లాప్ ఇవ్వనని, ప్రేక్షకులంతా క్షమించాలంటూ బహిరంగ లేఖ కూడా విడుదల చేశాడు వరుణ్ తేజ్. కానీ గని సినిమాను మించిన డిజాస్టర్ ఇంకోటి వచ్చేసింది. అదే గాండీవధారి అర్జున.

వరుణ్ తేజ్ తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. రిలీజైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి వారాంత గడిచేసరికి డిజాస్టర్ అనిపించుకుంది. ఇది ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందంటే, కనీసం క్యూబ్స్ కోసం పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాలేదనేది టాక్.

ఈ సినిమాతో తన రికార్డును తానే తిరగరాశాడు వరుణ్ తేజ్. కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా వసూళ్లు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రిలీజై 3 రోజులు గడిచినా ఎక్కడా కోటి రూపాయల షేర్ కూడా దాటలేదు. ఆంధ్రా, నైజాం, సీడెడ్.. ఇలా ఏ ప్రాంతంలో చూసుకున్నా ఈ సినిమాకు కోటి షేర్ దాటలేదు.

మొత్తంగా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం రెండున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఏపీ,నైజాంలో ఈ సినిమాను 17 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ లెక్కన ఈ సినిమా కొన్న బయ్యర్లు ఏ స్థాయిలో నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు.

First Published:  28 Aug 2023 5:25 PM GMT
Next Story