Telugu Global
Cinema & Entertainment

Game Chamger - చరణ్ సినిమాకు ఇబ్బంది ఏంటి?

Game Changer Movie - చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఎందుకు మొదలవ్వలేదు?

Ram Charans Game Changer: 12 వందల మందితో ఒక్కడు
X

Ram Charan's Game Changer: 12 వందల మందితో ఒక్కడు

చరణ్-శంకర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకా చెప్పాలంటే, ఈ మూవీ షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. ఆ తర్వాత కాస్త ప్యాచ్ వర్క్ పూర్తిచేస్తే, టోటల్ మూవీ అయిపోతుంది.

ఓవైపు సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతున్నప్పటికీ.. యూనిట్ మాత్రం ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు. కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టారు. దీని వెనక ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ తో పాటు ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు శంకర్. ఈ సినిమా కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కోర్టు వరకు వెళ్లి, తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఇండియన్-2ను శంకర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అలా కెరీర్ లో తొలిసారి ఒకేటైమ్ లో 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు శంకర్.

ఇక్కడే ఓ చిన్న మెలిక ఉన్నట్టు తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం, ముందుగా ఇండియన్-2 సినిమా రిలీజ్ అవ్వాలంట. ఆ తర్వాతే గేమ్ ఛేంజర్ రావాల్సి ఉంటుంది. అందుకే దిల్ రాజు తన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదని, ప్రచారం స్టార్ట్ చేయడం లేదని తెలుస్తోంది.

మరోవైపు ఇండియన్-2 సినిమా కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే విడుదల తేదీ ప్రకటించలేదు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ బయటకొచ్చిన వెంటనే, గేమ్ ఛేంజర్ పబ్లిసిటీ డేట్స్ కూడా లాక్ చేస్తారు.

First Published:  31 May 2023 3:43 AM GMT
Next Story