Telugu Global
Cinema & Entertainment

Game Changer | ఫ్యాన్స్ ను పట్టించుకోని శంకర్

Game Changer - శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు సంబంధించి మెగా ఫ్యాన్స్ ను శంకర్ పట్టించుకోవడం లేదంట.

Game Changer | ఫ్యాన్స్ ను పట్టించుకోని శంకర్
X

దర్శకుడు శంకర్ రామ్ చరణ్ అభిమానులను కలవరపెడుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా కోసం దాదాపు రెండేళ్లు పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా నుంచి అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు.

మీడియా ఫ్రెండ్లీగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, పేరుకే నిర్మాత తప్ప, ప్రచారంలో అతడి ప్రమేయం లేదు. ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది పూర్తిగా శంకర్ చేతుల్లో ఉంది. దీంతో గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ పై క్లారిటీ రావడం లేదు. అటు శంకర్ చేతిలో ఇండియన్-2 సినిమా కూడా ఉండడం, అది ముందుగా విడుదలకు సిద్ధమవ్వడంతో, గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం చాన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

చివరికి మొదటి లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా కూడా అనిశ్చితి కనిపిస్తోంది. దీపావళికి 'జరగండి' అనే లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు, ప్రోమో రాలేదు. దీపావళికి కౌంట్ డౌన్ పోస్టర్ కూడా లేదు.

మరోవైపు శంకర్ ప్రస్తుతం విజయవాడలో భారతీయుడు-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శంకర్ గేమ్ ఛేంజర్ కంటే ఇండియన్ 2పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అభిమానులు మరింత నిరాశకు గురవుతున్నారు.

First Published:  10 Nov 2023 4:56 PM GMT
Next Story