Telugu Global
Cinema & Entertainment

Gam Gam Ganesha | రేపే గం..గం..గణేశ ట్రయిలర్ రిలీజ్

Gam Gam Ganesha - ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం..గం..గణేశ. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు లాంఛ్ చేయబోతున్నారు.

Gam Gam Ganesha | రేపే గం..గం..గణేశ ట్రయిలర్ రిలీజ్
X

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది.

ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు "గం..గం..గణేశా" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోందంటున్నాడు ఆనంద్ దేవరకొండ. సినిమాకు సంబంధించి ఇప్పటికే అతడు ప్రచారం షురూ చేశాడు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

బేబి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇది. అయితే ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని, బేబి సినిమా చూసి అంచనాలు పెట్టుకొని రావొద్దని కోరుతున్నాడు. ఓ మంచి కథ, ట్రీట్ మెంట్ కోసం గం..గం..గణేశ సినిమా చూడొచ్చని భరోసా ఇస్తున్నాడు. చేతన్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  19 May 2024 8:37 AM GMT
Next Story