Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | ఇదే నా చివరి ప్రయోగాత్మక చిత్రం

Vishwak Sen - గామి సినిమాతో ప్రయోగాత్మక చిత్రాలకు విరామం ఇస్తానంటున్నాడు హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతానికి అదే తన చివరి ప్రయోగాత్మక సినిమా అని చెబుతున్నాడు.

Vishwak Sen | ఇదే నా చివరి ప్రయోగాత్మక చిత్రం
X

ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటాడు విశ్వక్ సేన్. అతడి కెరీర్ లో అతిపెద్ద ప్రయోగం ఏదైనా ఉందంటే అది గామి సినిమా మాత్రమే. ఈ సినిమాలో అతడు అఘోరాగా నటించాడు. మానవ స్పర్శ తెలియని వ్యక్తిగా డిఫరెంట్ పాత్ర పోషించాడు.

మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది గామి సినిమా. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్ సేన్, ఇకపై తను ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించాడు.

గామి తర్వాత ప్రయోగాత్మక చిత్రాలకు దాదాపు ఓ మూడేళ్ల పాటు గ్యాప్ ఇవ్వబోతున్నానని, ఆ తర్వాత అలాంటి చిత్రాలు చేయాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు విశ్వక్ సేన్.

విశ్వక్ సేన్ కు గుర్తింపు తెచ్చిపెట్టినవే ప్రయోగాత్మక చిత్రాలు. కెరీర్ స్టార్టింగ్ నుంచి అతడు డేరింగ్ స్టెప్స్ తీసుకున్నాడు. అదే అతడికి హిట్స్ తో పాటు క్రేజ్ తెచ్చిపెట్టింది. అలాంటి వ్యక్తి కొన్నాళ్ల పాటు ప్రయోగాలు చేయనంటున్నాడు.

First Published:  2 March 2024 8:27 AM GMT
Next Story