Telugu Global
Cinema & Entertainment

Gaami | ఓ సాహసయాత్ర చేశానంటున్న హీరోయిన్

Gaami - గామి సినిమాను ఓ సాహసోపేత యాత్రగా చెప్పుకొచ్చింది హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె ఎందుకలా చెప్పింది?

Gaami | ఓ సాహసయాత్ర చేశానంటున్న హీరోయిన్
X

విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. ఈ సినిమాను వి-సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రయిలర్ కూడా హిట్టయింది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకుంది.

"గామి ప్రాజెక్ట్ లో మొదటి రోజు నుంచి ఉన్నాను. మను సినిమా చేసినపుడు దర్శకుడు విద్యాధర్ గారు పరిచమయ్యారు. గామి అంటే సీకర్.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లోకేషన్స్ లో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించాం. మా టీంలో నేను ఒక్కరే అమ్మాయిని. అందరం ఒక బస్ లో వెళ్లి సూర్యస్తమయం వరకూ షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. షూటింగ్ లో చాలా సవాల్ తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం."

ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేసిందంట చాందినీ. వాటన్నింటినీ రియల్ గానే చేసినట్టు వెల్లడించింది.

గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయని... పొరపాటున కిందపడితే ప్రాణానికే ముప్పు వాటిల్లేదని, అంలాటి ప్రమాదకర పరిస్థితుల్లో షూట్ చేశామని వెల్లడించింది.

సినిమా మొత్తం ఓ సాహస యాత్రలా సాగిపోయిందని చెప్పుకొచ్చింది చాందినీ. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  4 March 2024 4:57 PM GMT
Next Story