Telugu Global
Cinema & Entertainment

G2 Movie | అడివి శేష్ సినిమా నుంచి పోస్టర్లు రిలీజ్

G2 Movie - గూఢచారి విడుదలై ఆరేళ్లు అవుతోంది. దీనికి గుర్తుగా గూఢచారి-2 (జీ2) సినిమా నుంచి 6 ఫొటోలు రిలీజ్ చేశారు.

G2 Movie | అడివి శేష్ సినిమా నుంచి పోస్టర్లు రిలీజ్
X

తెలుగులో సూపర్ హిట్టయిన స్పై మూవీస్ లో “గూఢచారి” ఒకటి. అడివి శేష్ నటించిన ఈ చిత్రం మంచి రివ్యూలను అందుకుంది. కమర్షియల్ గా కూడా హిట్టయింది. ఈ సినిమా విడుదలై తాజాగా ఆరేళ్లు పూర్తయింది.

ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా G2 (గూఢచారి 2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “గూఢచారి” విడుదలై ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అడివి శేష్ జి2 చిత్రం నుండి 6 ఫోటోలను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

గుఢచారి సినిమాలో హీరో దేశం కోసం దేశంలోనే పోరాడతాడు. జీ2లో మాత్రం భారతదేశం వెలుపల తన దేశం కోసం పోరాడతాడు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటి బనితా సందు ఈ థ్రిల్లర్‌తో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. మధు శాలిని, ప్రకాష్ రాజ్, సుప్రియ యార్లగడ్డ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.




First Published:  3 Aug 2024 4:17 PM GMT
Next Story