Telugu Global
Cinema & Entertainment

G2 Movie | గూఢచారి 2 రెగ్యులర్ షూట్ మొదలు

G2 Movie - అడివి శేష్ హీరోగా రాబోతున్న సినిమా G2. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.

G2 Movie | గూఢచారి 2 రెగ్యులర్ షూట్ మొదలు
X

అడివి శేష్ 'G2' ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సినిమా స్కేల్ మరింత పెద్దదిగా కనిపిస్తోంది. బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళింది. G2 షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

మొదటి దశ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో 5 అంతస్తుల భారీ గ్లాస్ సెట్‌ను నిర్మించారు. తొలి షెడ్యూల్ లో, స్టయిలిష్ సూట్ ధరించిన అడివి శేష్ అందరిని ఆకట్టుకున్నాడు.

'G2' ఒక స్పై థ్రిల్లర్, ఇది సక్సెస్ ఫుల్ గూఢచారి ఫ్రాంచైజీలో రెండో సినిమా. తన దేశం కోసం పోరాడటానికి ఇండియా వెలుపల మిషన్‌లో ఉన్న గూఢచారి కథ ఇది. ఈ విషయాన్ని ఫస్ట్ మూవీ గూఢచారి సినిమా క్లయిమాక్స్ లోనే వెల్లడించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి 1 తో పోలిస్తే, ఈ సీక్వెల్ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని చెబుతున్నాడు అడివి శేష్.

First Published:  11 Dec 2023 4:55 PM GMT
Next Story