Telugu Global
Cinema & Entertainment

ఏకంగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన నితిన్

సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాడు నితిన్. తన కొత్త సినిమా నుంచి ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశాడు. చూసేయండి..!

ఏకంగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన నితిన్
X

సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో.. మ్యాగ్జిమమ్ ఆడియన్స్ కు చేరువ కావడమే లక్ష్యంగా మేకర్స్ అంతా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాచర్ల నియోజకవర్గం యూనిట్ మరో అడుగు ముందుకేసింది. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి ఓ పాటను పూర్తిగా రిలీజ్ చేసింది.

అవును.. మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించాడు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట 'అదిరిందే' పాట తాజాగా విడుదలైంది. ఈసారి లిరికల్ వీడియోగా కాకుండా, ఏకంగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు.

సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్ తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచాడు. పాట వినిపించిన విధానం చెవులకింపుగా ఉంది. పాటలో నితిన్, కృతి శెట్టి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీస్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది.

కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సినిమా ఆగస్ట్ 12న థియేటర్లలోకి వస్తోంది.



First Published:  23 July 2022 1:50 PM GMT
Next Story