Telugu Global
Cinema & Entertainment

Like Share & Subscribe: ఫోక్ సాంగ్.. కానీ ఇది ట్రెండీ

Like Share & Subscribe అనే సినిమా నుంచి ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది అన్ని జానపదాల్లాంటిది కాదు, వింటే మీకే అర్థమౌతుంది.

Like Share & Subscribe: ఫోక్ సాంగ్.. కానీ ఇది ట్రెండీ
X

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కింది ఈ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మాత.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ''లచ్చమమ్మో' వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటని ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. సాధారణంగా జానపద బాణీలన్నీ ఒకే రకమైన బీట్ తో ఉంటాయి. కానీ ఇది మాత్రం డిఫరెంట్.

గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన స్టయిల్ లో ఆలపించాడు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. ఈ పాటను విదేశాల్లో పిక్చరైజ్ చేశారు.

ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.



First Published:  1 Nov 2022 2:46 AM GMT
Next Story