Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam - శాకుంతలం ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే?

Samantha's Shaakuntalam Movie First Song - సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

Shaakuntalam - శాకుంతలం ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే?
X

"మ‌ల్లికా మ‌ల్లికా మాల‌తీ మాలికా.." అనే లిరిక్స్ తో శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజైంది. త‌న భ‌ర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంత‌ల త‌న చుట్టూ ఉన్న మొక్క‌లు, ప‌క్షులతో మ‌న‌సులోని బాధను అందంగా వ్య‌క్తం చేసే సందర్భంలో ఈ పాట వస్తుంది. పూర్తి స్థాయి విజువ‌ల్స్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ పాట‌ను చూసి ఎంజాయ్ చేయాలంటే ఫిబ్ర‌వ‌రి 17 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మ‌హాక‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత న‌టిస్తోన్న ఈ చిత్రంలో దుష్యంత మ‌హారాజు పాత్ర‌లో దేవ్ మోహ‌న్ న‌టించాడు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాషల్లో ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఇప్పటికే మొదలుపెట్టగా, తొలి లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. రమ్య బెహ్రా ఆలపించింది.

దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది. గుణ శేఖ‌ర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించాడు.



First Published:  19 Jan 2023 3:16 PM GMT
Next Story