Telugu Global
Cinema & Entertainment

Devil Movie | కల్యాణ్ రామ్ సినిమా పాటల ప్రచారం మొదలు

Kalyan Ram's Devil Movie - కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి.

Devil Movie | కల్యాణ్ రామ్ సినిమా పాటల ప్రచారం మొదలు
X

నందమూరి కళ్యాణ్ రామ్.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్.

రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. ‘డెవిల్’ మూవీ నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ అనే పాటను తొలి సాంగ్‌గా రిలీజ్ చేశారు.

‘మాయే చేశావే..’ పాట ఓ మెలోడీ సాంగ్. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం ఇంకా హైలైట్‌గా నిలిచింది.

ఈ పాటకు బృంద మాస్టర్ నృత్యాన్ని సమకూర్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ రెట్రో ట్రాక్‌ను అందించాడు. పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్త అద్బుతమైన నటనతో మెప్పించారు. వీరి మధ్య కుదిరిన చక్కటి కెమిస్ట్రీ ఆడియెన్స్‌ని ఎంతో గొప్పగా అలరిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ సంస్థపై నిర్మించిన ఈ సినిమాలో భారీ సెట్స్ కనువిందు చేయబోతున్నాయి.

శ్రీకాంత్ విస్సా అద్భుతమైన కథ, కథనం, మాటలను సమకూర్చారు. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో నిర్మాత అభిషేక్ నామానే దర్శకత్వం అనే కార్డు వేసుకున్నాడు.

Next Story