Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | నాని మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

Hi Nanna Movie - నాని హీరోగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

Hi Nanna | నాని మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
X

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘హాయ్ నాన్నా’. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ కు సంబంధించి సమయమా ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పుడా సాంగ్ ను మార్కెట్లోకి వదిలారు.

సమయమా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట, మోడ్రన్ టచ్ తో బ్యూటిఫుల్ గా ఉంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ బాగున్నాయి. హీరో తన సంతోషాన్ని వ్యక్తం చేసే సందర్భంలో వచ్చిన సాంగ్ ఇది. నాని, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కెమిస్ట్రీతో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. హేషమ్ కంపోజ్ చేసిన ఈ బాణీ వినగానే ఆకట్టుకునేలా ఉంది.

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. 'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దసరా తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే. దసరాలో పక్కా మాస్ గెటప్ లో కనిపించిన నాని, ఈ సినిమాలో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, తన కెరీర్ లో విలక్షణ చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు నాని.

First Published:  16 Sep 2023 4:53 PM GMT
Next Story