Telugu Global
Cinema & Entertainment

ఘోస్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ

నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ది ఘోస్ట్. సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రయిలర్ రిలీజైంది. రేపట్నుంచి సాంగ్స్ రిలీజ్ చేసే కార్యక్రమం షురూ చేశారు.

ఘోస్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ షురూ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు విడుదల కానుంది. వేగం అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఓ రొమాంటిక్ నంబర్.

భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఈ పాటను పాడగా, కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలిసి క్రూయిజ్‌లో సమయాన్ని ఆస్వాదించడాన్ని ఈ పోస్టర్ లో చూడొచ్చు.

పోస్టర్ చూస్తుంటే, సినిమాలో యాక్షన్ తో పాటు గ్లామర్ డోస్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

మూవీలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రయిలర్ తో భారీగా అంచనాలు పెంచిన ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తోంది.

First Published:  15 Sep 2022 2:06 PM GMT
Next Story