Telugu Global
Cinema & Entertainment

పూర్ణోదయ క్రియేషన్స్ నుంచి సినిమా ట్రయిలర్ వచ్చింది

దశాబ్దాల విరామం తర్వాత పూర్ణోదయ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలోకి వచ్చింది. ఈసారి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిన్న సినిమాను నిర్మించింది. ఈరోజు రిలీజైన ఆ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం

పూర్ణోదయ క్రియేషన్స్ నుంచి సినిమా ట్రయిలర్ వచ్చింది
X

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

'జాతిరత్నాలు'తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు.

టీజర్ తో ఇప్పటికే ప్లాట్‌లైన్‌ను రివీల్ చేయగా, ట్రైలర్ మరిన్ని విజువల్స్, కంటెంట్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ ని మెప్పించే అవకాశం వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుతుంది ప్రేయసి.

టిక్కెట్ల కోసం అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమైన హీరో చివరి ప్రయత్నంగా నేరుగా థియేటర్‌ వద్దకు వెళ్తాడు. అక్కడ భారీగా ప్రేక్షకులు, అభిమానుల జాతరని చూస్తాడు. హీరో తన ప్రేయసితో కలసి ఖుషి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడటం ఇందులో కథాంశం.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వెన్నెల కిషోర్ పాత్ర సినిమాలో అలరించబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. తనికెళ్ల భరణి హీరో తండ్రి పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషుల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగవ్వ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. దర్శకుడు వంశీధర్ పాత్ర నవ్వులు పూయించింది. ట్రైలర్ లో చివరి సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంది. ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  25 Aug 2022 2:58 PM GMT
Next Story