Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాకు ఫండింగ్ సమస్య?

ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రావాల్సిన సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. మొన్నటివరకు ఈ సినిమాకు కథ సెట్ కాలేదంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఫండింగ్ సమస్యలంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ సినిమాకు ఫండింగ్ సమస్య?
X

ఇది ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమా సమస్య మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రతి పెద్ద సినిమాకు ఈ సమస్య ఎదురు కావొచ్చు. ఎందుకంటే, టాలీవుడ్ ఇప్పుడు ఫైనాన్షియర్ల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఫైనాన్స్ దొరకడం చాలా కష్టంగా మారింది. దీనికి ఓ కారణం ఉంది.

టాలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఫైనాన్స్ అంటే కేవలం ఇద్దరు మాత్రమే ముందుకొస్తారు. వాళ్లే సత్య రంగయ్య, వెంకటరామ్ రెడ్డి. వీళ్లిద్దరూ వందల కోట్లలో అప్పులు ఇవ్వగలరు. ఇప్పటివరకు అదే చేశారు కూడా. కానీ ఇప్పుడు వీళ్లు తమ ఫైనాన్స్ వ్యాపారాన్ని పరిమితం చేశారు.

టాలీవుడ్ లో మారిన పరిస్థితుల దృష్ట్యా వీళ్లు తమ ఫైనాన్స్ వ్యాపారాన్ని దాదాపు సగానికి సగం తగ్గించుకున్నారు. 50 కోట్ల ఫైనాన్స్ కోసం వెళ్తే, వీళ్ల నుంచి 10 కోట్లు రావడం కూడా కష్టంగా మారిందంట. ఈ ప్రభావం ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ సినిమాపై పడింది.

ఈ సినిమా కోసం చాన్నాళ్ల కిందటే ఈ ఇద్దరు ఫైనాన్సియర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో, వాళ్లు ఒప్పందాలు కుదించుకున్నారు. దీంతో కొత్త ఫైనాన్సియర్ల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

టాలీవుడ్ లో డబ్బులు పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారు. ఆ మాటకొస్తే 50 కోట్లు పెట్టడం అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లాంటోళ్లకు పెద్ద సమస్య కాదు. కానీ ఒకే సినిమాకు ఇంతమంది దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల వడ్డీలతో పాటు, సినిమాలో వాళ్ల జోక్యం కూడా పెరిగిపోతుంది. అందుకే సింగిల్ ఫైనాన్సియర్ కోసం ఎదురుచూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.

Next Story