Telugu Global
Cinema & Entertainment

Pooja Hegde | ఈసారి కాలం కలిసొస్తుందా..?

Pooja Hegde - వరుస ఫ్లాపులిచ్చిన పూజా హెగ్డే, ఎట్టకేలకు ఓ ఆఫర్ అందుకుంది. హిందీలో ఆమె షాహిద్ సరసన నటించనుంది.

Pooja Hegde
X

Pooja Hegde: సగం సగం వద్దంటున్న పూజా హెగ్డే

నటి పూజా హెగ్డే గత రెండేళ్లుగా కెరీర్ పరంగా దెబ్బలు తింటూనే ఉంది. ఆమె గత సినిమాలు, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సర్కస్, ఆచార్య, రాధే శ్యామ్ డిజాస్టర్లు అయ్యాయి. ఉన్నంతలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ అయినప్పటికీ, కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకుంది.

ఇక్కడితో ఆమె ఎదురుదెబ్బలు ఆగలేదు. గుంటూరుకారం లాంటి భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె తప్పుకుందా, యూనిట్ తొలిగించిందా అనేది అంతుచిక్కని రహస్యం. అది ఎప్పటికీ బయటకు రాదు. ఈ సినిమాను మిస్ చేసుకున్న కొన్ని రోజులకే ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అవకాశం చేజార్చుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోకి పూజాహెగ్డేను తీసుకోవాలని దర్శకుడు విశ్వప్రయత్నం చేశాడు. కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడు కాల్షీట్ ఇస్తాడో తెలియదు, ఆ కాల్షీట్ తో పూజాహెగ్డే కాల్షీట్ మ్యాచ్ అవుతుందో అవ్వదో తెలీదు. అందుకే రిస్క్ ఎందుకని వద్దనుకున్నారు.

అలా వరుసపెట్టి ఫ్లాపులు ఎదుర్కోవడం, సినిమాలు చేజార్చుకోవడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది పూజాహెగ్డే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ బ్యూటీ ఓ భారీ ప్రాజెక్టు చేజిక్కించుకున్నట్లు హిందీ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ త్వరలో ప్రారంభించబోయే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో పూజాహెగ్డే నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఈ గ్యాప్ లో పూజాహెగ్డే ఎంట్రీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాలో షాహిద్, పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. జీ స్టూడియోస్‌తో కలిసి సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా క్లిక్ అయితే పూజాహెగ్డే హవా మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఆమె కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడినట్టే.

First Published:  26 Sep 2023 5:42 PM GMT
Next Story