Telugu Global
Cinema & Entertainment

Nabha Natesh | నభా నటేష్ కొత్త సినిమా సంగతులు

Nabha Natesh - ఎట్టకేలకు ఓ ఆఫర్ అందుకుంది నభా నటేష్. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది.

Nabha Natesh | నభా నటేష్ కొత్త సినిమా సంగతులు
X

నభా నటేష్.. ఈ అమ్మాయిని ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఆడియన్స్ మరిచిపోతున్నారు. ఎందుకంటే, ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత తిరిగి ఆ ఊపును కొనసాగించలేకపోయింది నభా. మధ్యలో సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలు చేసినా అవి ఆమెకు కలిసిరాలేదు. దీనికితోడు యాక్సిడెంట్ వల్ల కెరీర్ లో గ్యాప్ రావడం ఆమెకు పెద్ద దెబ్బగా మారింది.

అయినప్పటికీ అవకాశాల కోసం ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. గ్లామర్ ఫొటోల్ని పోస్ట్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు నభా నటేష్ కు అవకాశం వచ్చింది. ఆమె ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది.


టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శితో ఓ సినిమాలో నటిస్తోంది నభా నటేష్. ఇదొక కామెడీ ఎంటర్ టైనర్. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నభా నటేష్ పాత్ర కామెడీ పండిస్తుందంట.

అంతేకాదు, తెలంగాణ యాసలో కూడా మాట్లాడుతుందంట. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాను షూట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కూడా పూర్తి కావొస్తోందో. అంతా పూర్తయి, రష్ చూసిన తర్వాత సంతృప్తి చెందితే సినిమాను ప్రకటించాలనుకుంటున్నారు.

ఒకవేళ రష్ చూసి నచ్చకపోతే మళ్లీ రీషూట్ కు వెళ్తారు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై నభా నటేష్ చాలా ఆశలు పెట్టుకుంది. లేకలేక వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది.

First Published:  14 March 2024 4:59 PM GMT
Next Story