Telugu Global
Cinema & Entertainment

Eagle | ఎట్టకేలకు ఈగల్ కు సోలో రిలీజ్

Eagle Movie - మొత్తానికి ఈగల్ మూవీకి సోలో రిలీజ్ దక్కింది. రవితేజ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

Eagle | ఎట్టకేలకు ఈగల్ కు సోలో రిలీజ్
X

సంక్రాంతి సినిమాల తర్వాత ఫిలింఛాంబర్ కు వెంటనే పని పడింది. ఫిలించాంబర్ పెద్దల మాటలు నమ్మి సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమాను తప్పించిన సంగతి తెలిసిందే. ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామనేది దిల్ రాజు వాగ్దానం. కానీ అలా జరగలేదు.

ఫిబ్రవరి 9కి ఊరు పేరు భైరవకోన అనే సినిమా షెడ్యూల్ అయింది. తమను ఎవ్వరూ సంప్రదించకోపవడంతో ఆ సినిమా ప్రజెంటర్ అనీల్ సుంకర హర్ట్ అయ్యారు. దీంతో ఈగల్ సినిమా నిర్మాతలు ఫిలింఛాంబర్ కు లెటర్ రాశారు.

ఇలా కాస్త వివాదాస్పదమైన ఈ అంశం ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ఉరు పేరు భైరవకోన సినిమాను 9వ తేదీ నుంచి తప్పించారు. కుదిరితే ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా వస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

దిల్ రాజుతో పాటు మరికొంతమంది రంగంలోకి దిగి ఈ ఇష్యూను పరిష్కరించారు. ఫలితంగా ఈగల్ కు సోలో రిలీజ్ దక్కింది. మూవీకి లైన్ క్లియర్ అవ్వడంతో ప్రచారం మళ్లీ మొదలుపెట్టారు. స్వయంగా రవితేజ రంగంలోకి దిగి మీడియాకు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశాడు.

First Published:  29 Jan 2024 5:10 PM GMT
Next Story