Telugu Global
Cinema & Entertainment

Salaar | సలార్ నుంచి సూరీడే సాంగ్ రిలీజ్

Salaar - ఎట్టకేలకు సలార్ నుంచి ఓ సాంగ్ రిలీజైంది. ఇంతకీ ఆ పాట ఎలా ఉంది?

Salaar | సలార్ నుంచి సూరీడే సాంగ్ రిలీజ్
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌ుడు. డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచుతూ తాజాగా ‘సూరీడే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

సూరీడే అనే సాంగ్ ఓ మాంటేజ్ సాంగ్. ప్రభాస్, పృధ్వీరాజ్ పాత్రల మధ్య స్నేహబంధాన్ని చెప్పేలా ఈ సాంగ్ తెరకెక్కింది. లిరిక్స్ వింటుంటే హృద‌యాన్ని హత్తుకునే భావోద్వేగాలు క‌నిపిస్తున్నాయి. ఇది సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంద‌ని, ఒకే ఆత్మ అనేలా ఉండే ఇద్ద‌రి స్నేహితులు గురించి ఈ పాట చెబుతుంది. వారే ఒక‌రికొకరు బ‌లం.. వారే ఒక‌రికొక‌రు బ‌ల‌హీన‌త అని పాట వివ‌రిస్తుంది. ర‌వి బస్రూర్ సంగీత సార‌థ్యంలో హ‌రిణి పాడిన ఈ సాంగ్‌ను కృష్ణ‌కాంత్ రాశారు.

స‌లార్ సీజ్ ఫైర్ కేవ‌లం యాక్ష‌న్ సినిమాయే కాదు..అంత‌కు మించి ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంటుంద‌ని ఆడియెన్స్‌కి క్లియ‌ర్‌గా తెలుస్తోంది. స‌లార్ సీజ్ ఫైర్ సెన్సార్ పూర్తి చేసుకుని ఏ-స‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 55 నిమిషాల వ్య‌వ‌ధితో ప్రేక్ష‌కులను అల‌రించ‌నుంది.

క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

First Published:  14 Dec 2023 1:52 AM GMT
Next Story