Telugu Global
Cinema & Entertainment

RRR Movie: "ఆర్ ఆర్ ఆర్" సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ ని ప్రశ్నిస్తున్న అభిమానులు

RRR Movie: ఇతర దేశాల్లో కూడా చాలామంది ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ లో చూశారు. మరి అలాంటిది నెట్ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ సినిమాలో జాబితాలో "ఆర్ఆర్ఆర్" పేరు ఎందుకు లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

RRR Movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ ని ప్రశ్నిస్తున్న అభిమానులు
X

2022 లో టాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. భారీ అక్షరాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా రికార్డుల వర్షం కురిపించింది.

అయితే ఎప్పటికప్పుడు డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ వారు మోస్ట్ వాచ్డ్ సినిమాస్ గురించి సిరీస్ గురించి లిస్ట్ ప్రకటిస్తూ ఉంటారు. అందులో తమ అభిమాన సినిమా లేకపోతే అభిమానులు గొడవలు కూడా చేస్తూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు "ఆర్ ఆర్ ఆర్" విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ మరియు నాన్ ఇంగ్లీష్ లో మోస్ట్ వాచ్డ్ సినిమాల లిస్టును విడుదల చేశారు.

"ఆర్ఆర్ఆర్" సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ టాప్ టెన్ నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో "ఆర్ఆర్ఆర్" కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అభిమానులను నిరాశకు గురి చేస్తూ నెట్ ఫ్లిక్స్ వారు "ఆర్ఆర్ఆర్" పేరుని మెన్షన్ చేయలేదు. నిజానికి "ఆర్ఆర్ఆర్" సినిమాతో నెట్ఫ్లిక్స్ కి మరింత ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు.

ఇతర దేశాల్లో కూడా చాలామంది ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ లో చూశారు. మరి అలాంటిది నెట్ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ సినిమాలో జాబితాలో "ఆర్ఆర్ఆర్" పేరు ఎందుకు లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా విడుదలై చాలా కాలం అయింది. విడుదలైన కొత్తల్లో చాలామంది ఈ సినిమాని చూసి ఉండొచ్చు కానీ ఇప్పటికీ సినిమాని చూసేవాళ్ళ సంఖ్య తగ్గి ఉండొచ్చు.

First Published:  30 Dec 2022 1:24 PM GMT
Next Story