Telugu Global
Cinema & Entertainment

వారసుడు ప్రమోషన్ల విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

తాజాగా ఇప్పుడు విజయ్ కెరియర్ లోనే తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

Varasudu Movie Promotions
X

వారసుడు ప్రమోషన్ల విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. చాలా వరకు తమిళ్ లో విజయ్ సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇప్పుడు విజయ్ కెరియర్ లోనే తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మహర్షి ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ త్వరలో తెలుగు మరియు తమిళ్ బై లింగువల్ సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

తమిళ్లో "వారీసు" అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా థియేటర్ల విషయంలో దిల్ రాజుకి మరియు ఇతర డిస్ట్రిబ్యూటర్లకు గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో అభిమానులు నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా సినిమా నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. అందులో నుంచి ఒక ఎమోషనల్ సాంగ్ కి ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ మధ్యకాలంలో చాలాకాలం తర్వాత విజయ్ నటించిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పటిదాకా సినిమా నుంచి ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కాలేదు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు తమిళ్లో ఈ సినిమాకి పోటీగా విడుదల కాబోతున్న అజిత్ "తునివు" సినిమా ప్రమోషన్లు విషయంలో కూడా అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఇప్పటికైనా చిత్ర బృందం ప్రమోషన్లను మొదలు పెడుతుందో లేదో వేచి చూడాలి.

First Published:  22 Dec 2022 7:20 AM GMT
Next Story