Telugu Global
Cinema & Entertainment

Family Star Movie OTT | ఓటీటీలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్

Family Star Movie OTT | విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

Family Star Movie OTT | ఓటీటీలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్
X

Family Star Movie OTT | విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ అర్థరాత్రి నుంచే తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఈ నెల 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. కానీ వాళ్లు అనుకున్నది జరగలేదు. రోజురోజుకు క్షీణించి, 2 వారాలు గడిచేసరికి థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది.

విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ డైరక్ట్ చేశాడు.

నెగెటివ్ టాక్ తో థియేటర్లలో మిస్సయిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ బజ్ కనుక కార్యరూపం దాలిస్తే అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం.

First Published:  25 April 2024 1:45 PM GMT
Next Story