Telugu Global
Cinema & Entertainment

Family Star | ఫ్యామిలీ స్టార్ మ్యూజికల్ ప్రమోషన్స్

Family Star - విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి.

Family Star | ఫ్యామిలీ స్టార్ మ్యూజికల్ ప్రమోషన్స్
X

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నారు. 'నందనందనా..' అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు ంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అది ఎంతగానో ఆకట్టుకుంది.

'నందనందనా..' పాట ప్రోమోలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సంతోషంగా కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ సూపర్ హిట్ మూవీ "గీత గోవిందం"లో ఛాట్ బస్టర్ సాంగ్ 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...'కు వర్క్ చేసిన గేయరచయిత అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో 'నందనందనా..' సాంగ్ వస్తుండటంతో ఈ పాటపై క్రేజ్ పెరిగింది.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్టే ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు మేకర్స్. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

First Published:  7 Feb 2024 1:32 AM GMT
Next Story