Telugu Global
Cinema & Entertainment

EXTRA - Ordinary Man | నితిన్ సినిమా కోసం భారీ సెట్

EXTRA Ordinary Man - నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఈ సినిమా సాంగ్ షూట్ నడుస్తోంది. దీంతో టోటల్ షూట్ పూర్తవుతుంది.

Extra Ordinary Man OTT | ఓటీటీలోకి నితిన్ సినిమా
X

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట చిత్రీకరణతో టోటల్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ప్రచారం కూడా సాగుతోంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’, ‘బ్రష్ వేస్కో..’ సాంగ్స్ విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ కూడా బాగుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సీనియర్ హీరో రాజశేఖర్, ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. అతడి పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం.

First Published:  22 Nov 2023 5:41 PM GMT
Next Story