Telugu Global
Cinema & Entertainment

Project K Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్..ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ ఫిక్స్

Prabhas's Project K Release Date: శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ -కే రిలీజ్ డేట్ ప్రకటించడంతోపాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒక పెద్ద చెయ్యి కనిపిస్తుండగా, ఆ చేతి వైపు తుపాకీ గురి పెడుతూ ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు.

Project K Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్..ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ ఫిక్స్
X

Project K Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్..ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ ఫిక్స్

బాహుబలి సినిమా చేసినప్పటి నుంచి ప్రభాస్ నుంచి సినిమాలు రావడమే తగ్గిపోయింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకే పరిమితం అయ్యాడు. బాహుబలి తర్వాత రెండేళ్లకు వచ్చిన సాహో ప్లాప్ కాగా, ఆ తర్వాత మరో రెండేళ్లకు వచ్చిన రాధే శ్యామ్ డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ప్రభాస్ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ కాగా తాజాగా ప్రాజెక్ట్ -కే (వర్కింగ్ టైటిల్) మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రాజెక్ట్ -కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వివిధ కాలాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

కాగా, శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ -కే రిలీజ్ డేట్ ప్రకటించడంతోపాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒక పెద్ద చెయ్యి కనిపిస్తుండగా, ఆ చేతి వైపు తుపాకీ గురి పెడుతూ ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. ఈ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసుకొని విధంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని మలుస్తున్నాడు. ప్రాజెక్ట్ -కేలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటించడం, మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

First Published:  18 Feb 2023 4:05 PM GMT
Next Story