Telugu Global
Cinema & Entertainment

Eesha Rebba | ప్రతి 10 నిమిషాలకు ఓ సర్ ప్రైజ్

Eesha Rebba - మామా మశ్చీంద్ర సినిమాలో సుధీర్ బాబు సరసన నటించింది ఈషా రెబ్బా. ఈ సినిమా గురించి ఆమె ఏమంటోందంటే..

Eesha Rebba | ప్రతి 10 నిమిషాలకు ఓ సర్ ప్రైజ్
X

నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్‌ ని క్రియేట్ చేసింది.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బా మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలు క్లుప్తంగా..

- హర్షవర్ధన్ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటెడ్ గా అనిపించింది. చాలా మలుపులు, ఎంటర్ టైనర్ మెంట్ ఉన్న కథ ఇది. అవుట్ పుట్ చూసిన తర్వాత ఎక్సయిట్మెంట్ ఇంకా పెరిగింది. ఆయన చెప్పింది చాలా క్లియర్ గా క్లారిటీతో తీశారు. కామెడీ ఎమోషన్స్ ఫన్ .. అన్నీ ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

- రైటర్ డైరెక్టర్ కావడం వలన పాత్రలని ఇంకా వివరంగా రాసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రతి పాత్రకు లేయర్స్ ఉన్నాయి. సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆయన లుక్స్ తో పాటు డైలాగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి.

- మామా మశ్చీంద్ర సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. చాలా ట్విస్టులు, టర్నులు ఉంటాయి.

- ఇందులో నా పాత్ర పేరు వైరల్ విశాలాక్షి. తను టిక్ టాక్ వీడియోలు చేస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకూ కొత్త. ఇందులో కొన్ని వైరల్ గా ఉండే వీడియోస్ చేశాను. నా పాత్ర చాలా హైపర్ గా ఉంటుంది.

- సినిమాలో సుధీర్ బాబు ఒక గెటప్ లో బాయ్ ఫ్రెండ్ గా మరో గెటప్ లో ఫాదర్ గా కనిపించడం కొత్తగా అనిపించింది. దుర్గా గెటప్ లో సెట్స్ లోకి వచ్చినపుడు అసలు గుర్తుపట్టలేకపోయాను. ఆయన సుధీర్ బాబు అని తెలిసి ఆశ్చర్యపోయాను. సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకు ఆ సర్ప్రైజ్ ఉంటుంది.

First Published:  30 Sep 2023 5:43 PM GMT
Next Story