Telugu Global
Cinema & Entertainment

Eagle Movie | ఈగల్ మూవీ ట్రయిలర్ రివ్యూ

Eagle Movie - రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నుంచి ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేశారు. అంచనాల్ని మరింత పెంచారు.

Eagle Movie | ఈగల్ మూవీ ట్రయిలర్ రివ్యూ
X

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ ని ఈరోజు విడుదల చేశారు.

రిలీజ్ ట్రైలర్ లో రవితేజ రెబల్ లుక్ లో కనిపించాడు. అతడి లుక్ బాగుంది. టెర్రిఫిక్ డైలాగ్‌లు, దావ్‌జాంద్ అద్భుతమైన బిజిఎమ్ ట్రయిలర్ లో ప్రధాన ఆకర్షణలు. టేకింగ్ టాప్ క్లాస్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది.

‘వచ్చాడంటే మోతర, విధ్వంసాల జాతర’ అనే లైన్స్ సినిమాలోని మాస్ మహారాజా పాత్రను వివరిస్తూ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తున్నాయి. హీరోయిజంను ఎలివేట్ చేస్తూ పెట్టిన డైలాగ్స్ అన్నీ బాగున్నాయి.

ఈగల్ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషించారు.

First Published:  7 Feb 2024 5:00 PM GMT
Next Story