Telugu Global
Cinema & Entertainment

Eagle Movie | సంక్రాంతి బరిలో రవితేజ మూవీ

Eagle Movie - క్రాక్ సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టాడు రవితేజ. ఇప్పుడు ఈగల్ సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు.

Ravi Teja | సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రవితేజ
X

'ధమాకా' బ్లాక్‌బస్టర్ తర్వాత, రెండోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి వర్క్ చేస్తున్నాడు రవితేజ. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్ లో 'ఈగల్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. మేకర్స్ ఇదివరకే రవితేజ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు, మేకర్స్ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈగల్ 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. పోస్టర్‌లో రవితేజ చేతిలో తుపాకీతో నిప్పు అంటుకున్న అడవిలో స్టైలిష్‌గా నిల్చున్నట్లుగా ఉంది. అయితే, పోస్టర్‌లో రవితేజ ముఖం కనిపించదు, అక్కడ మనం రెస్క్యూ టీం హెలికాప్టర్ చూడొచ్చు.

సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ హీరోయిన్, కావ్య థాపర్ సెకెండ్ హీరోయిన్. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషించారు.

కార్తీక్ ఘట్టమనేని రచించి, దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు.

First Published:  27 Sep 2023 5:20 PM GMT
Next Story