Telugu Global
Cinema & Entertainment

Dunki | షారూక్ సినిమా నుంచి ప్రచార గీతం రెడీ

Dunki - షారూక్ సినిమా డంకీ. ఈ సినిమా కోసం ఓ ప్రచార గీతాన్ని షూట్ చేస్తున్నారు.

Dunki | షారూక్ సినిమా నుంచి ప్రచార గీతం రెడీ
X

షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తాజాగా రిలీజైన ట్రయిలర్ సూపర్ హిట్టయింది. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా డంకీ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌‌ను దుబాయ్ లో చిత్రీకరిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం ఈ డాన్స్ నెంబర్ ను షూట్ చేస్తున్నారు.

‘‘షారూక్, హిరాని కలిసి ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ వేశారు. దీని కోసం వారు 3 రోజుల పాటు విలువైన సమయాన్ని కేటాయించారు. సుహానా సినిమా ప్రీమియర్ కోసం పాట చిత్రీకరణను పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి తిరిగి ఇండియా వచ్చేస్తారు. పరిమితమైన క్రూ సాయంతో అబుదాబి సరిహద్దు ప్రాంతాల్లో పాటను చిత్రీకరించారు. యు.ఎ.ఇలో షారూక్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు’’ అని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

డంకీ’ చిత్రంలో బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది డంకీ.

First Published:  10 Dec 2023 3:38 PM GMT
Next Story