Telugu Global
Cinema & Entertainment

Lucky Baskhar | లక్కీ భాస్కర్ టీజర్ ఎలా ఉందంటే..?

Lucky Baskhar - దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా టీజర్ రిలీజైంది. సినిమా జానర్ ను బయటపెట్టింది.

Lucky Baskhar | లక్కీ భాస్కర్ టీజర్ ఎలా ఉందంటే..?
X

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేదు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో ఇప్పటికే పాపులర్ అయ్యాడు. ఇప్పుడీ హీరో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పేరు 'లక్కీ భాస్కర్'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

'లక్కీ భాస్కర్' సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నాడు. ఒక సాధారణ వ్యక్తి, అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలతో టీజర్ ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే టీజర్ లో దుల్కర్ సల్మాన్ పలికిన సంభాషణలు, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కట్టిపడేశాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన 'సార్' సినిమా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా ఇదే.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటిస్తోంది. 'లక్కీ భాస్కర్' చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది.

జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌ లోనే తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించి, చిత్రంలో సంగీతం ఏ స్థాయిలో ఉండబోతుందో తెలియజేశాడు.

'లక్కీ భాస్కర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

First Published:  11 April 2024 4:25 PM GMT
Next Story