Telugu Global
Cinema & Entertainment

Lucky Baskhar | లక్కీ భాస్కర్ గా మారిన దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan as Lucky Baskhar - దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు సినిమా ప్రకటించాడు. దీని పేరు లక్కీ భాస్కర్.

Lucky Baskhar | లక్కీ భాస్కర్ గా మారిన దుల్కర్ సల్మాన్
X

దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు.

ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి హిట్ కొట్టాడు. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నాడు. దుల్కర్ సల్మాన్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్టు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)కి కూడా వీళ్లే నిర్మాతలు.

'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు 'లక్కీ భాస్కర్' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  28 July 2023 5:18 PM GMT
Next Story