Telugu Global
Cinema & Entertainment

Dulquer Salmaan - వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్

Dulquer Salmaan - దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పాడు. ఈసారి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

Dulquer Salmaan - వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్
X

మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అతను ఏ భాషలో నటించినా, అక్కడి సంస్కృతికి తగ్గట్లుగా తనను తాను మలచుకొని, ఆ మట్టిలో పుట్టిన వ్యక్తిగానే అందరికీ చేరువ అవుతాడు.

తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరైన దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలుపుతున్నాడు. సార్/వాతి తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఈ చిత్రం కూడా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరిస్తుందని చెబుతున్నాడు దుల్కర్. సీతారామం తర్వాత, దుల్కర్ తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే.

అద్భుతమైన కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

First Published:  14 May 2023 9:56 AM GMT
Next Story