Telugu Global
Cinema & Entertainment

సైడైన సలార్ డేట్‌లోకి చిన్న చిత్రాల క్యూ

ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న రూల్స్ రంజన్ సినిమాను అదే తేదీలో విడుదల చేయనున్నారు.

సైడైన సలార్ డేట్‌లోకి చిన్న చిత్రాల క్యూ
X

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలను అకస్మాత్తుగా నిలిపివేసినట్లు ప్రచారం మొదలైంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా టికెట్లు తీసుకున్న వారికి డిస్ట్రిబ్యూటర్లు తిరిగి డబ్బులు కూడా పే చేస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా సలార్ సినిమా రిలీజ్ ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఇక రావాల్సింది మేకర్స్ అధికారిక ప్రకటన మాత్రమే. సలార్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.

ఇదిలా ఉంటే సలార్ రిలీజ్ వాయిదా పడటంతో ఆ డేట్ ఖాళీ అయింది. దీంతో ఇప్పుడు చాలా సినిమాలు ఆ డేట్ పై కన్నేశాయి. భారీ హైప్ తో సలార్ వస్తుండటంతో ఆ డేట్ లో ఏ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. ఇప్పుడు సలార్ వాయిదా పడటంతో అక్టోబర్, నవంబర్ నెలలో విడుదల కావాల్సిన పలు సినిమాలు సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న రూల్స్ రంజన్ సినిమాను అదే తేదీలో విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ డేట్ లోకి మరో సినిమా వచ్చి చేరింది. తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రస్తుతం రత్తం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. అయితే సలార్ వాయిదా పడటంతో రత్తం సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో కూడా విడుదల చేసింది.

*

First Published:  4 Sep 2023 12:59 PM GMT
Next Story