Telugu Global
Cinema & Entertainment

DSP | ధనుష్ సినిమాకు దేవిశ్రీ సంగీతం

Devisri Prasad - ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది.

DSP | ధనుష్ సినిమాకు దేవిశ్రీ సంగీతం
X

ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది ఈ ప్రాజెక్టు. ఈ సినిమా షూటింగ్ కూడా లాంచ్ కి ఒక రోజు ముందే స్టార్ట్ అయింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉంది.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. శేఖర్ కమ్ముల, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. కమ్ముల సినిమాల్లో పాటలన్నీ సూపర్ హిట్. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అలాంటి వ్యక్తితో ఇప్పుడు దేవిశ్రీ కలిశాడు. సో.. ఈసారి మరిన్ని మ్యూజికల్ మెలొడీస్ ఆశించొచ్చు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది ఈ సినిమా. ఇంకా పేరుపెట్టని ఈ ప్రాజెక్టులో సెకెండ్ హీరోయిన్ కూడా ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. లవ్ స్టోరీ తర్వాత కమ్ముల నుంచి వస్తున్న సినిమా ఇదే.




First Published:  20 Jan 2024 5:04 PM GMT
Next Story