Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్-కొరటాల సినిమా.. మళ్లీ మొదటికొచ్చింది

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. ముందుగా అనుకున్న కథను పక్కనపెట్టి, ఇప్పుడు మరో కథపై కసరత్తు చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి

ఎన్టీఆర్-కొరటాల సినిమా.. మళ్లీ మొదటికొచ్చింది
X

ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఇక స్పీడ్ పెంచుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి తారక్ కు గ్యాప్ తప్పేలా లేదు. దీనికి కారణం కొరటాలతో చేయాల్సిన సినిమాపై ముసురుకుంటున్న అనుమానాలే.

ఎన్టీఆర్ కోసం కొరటాల ఆల్రెడీ కథ సిద్ధం చేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కొరటాల నీరసించిపోయాడు. ఎన్టీఆర్ సినిమా కథపై వర్క్ చేయలేకపోయాడు. అదే టైమ్ లో ఆల్రెడీ అనుకున్న స్టోరీలైన్ ను ఎన్టీఆర్ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా అప్పీల్ లేదని, మరో కొత్త కథపై కూర్చుందామని ఎన్టీఆర్, కొరటాలకు సూచించినట్టు కథనాలు వస్తున్నాయి. ఈసారి సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ కోసం ఓ కథ అనుకున్నాడట కొరటాల. ప్రస్తుతం దానిపైనే చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాను ఒకేసారి 9 భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారనే లీకులు కూడా వినిపిస్తున్నాయి. ఈ కథనాల సంగతి పక్కనపెడితే, ఎన్టీఆర్-కొరటాల సినిమా మరింత ఆలస్యం అవుతోందనేది మాత్రం వాస్తవం. అటు ఎన్టీఆర్ మేకోవర్ కూడా ఇంకా మొదలుకాలేదనే విషయం స్పష్టమైంది. తాజాగా అమిత్ షాను కలిసిన ఎన్టీఆర్, కాస్త బొద్దుగానే కనిపించాడు.

First Published:  27 Aug 2022 5:40 AM GMT
Next Story