Telugu Global
Cinema & Entertainment

Yashoda Movie: సమంత ఒప్పుకుంటే యశోదకు సీక్వెల్

యశోద సినిమాకు ఎన్ని సీక్వెల్స్ అయినా తీయొచ్చని చెబుతున్నారు దర్శకద్వయం హరి-హరీష్. సమంత అంగీకరిస్తే సీక్వెల్ కు తాము సిద్ధమని ప్రకటించారు.

Yashoda Movie: సమంత ఒప్పుకుంటే యశోదకు సీక్వెల్
X

సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా యశోద. ప్రస్తుతం థియేటర్లలో ఓ మోస్తరుగా నడుస్తున్న సినిమా ఇదొక్కటే. దీంతో యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా యశోదకు సీక్వెల్ తీస్తామని ప్రకటించారు దర్శకులు హరి-హరీష్. అయితే అది సమంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.

"యశోద 2 విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే... అది సమంతపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంత ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం. మా నిర్మాత గారూ రెడీగా ఉన్నారు."

Advertisement

ఇలా యశోద సీక్వెల్ పై స్పందించారు దర్శక ద్వయం హరి-హరీష్. పార్ట్-1లో ఉన్నట్టుగానే పార్ట్-2లో కూడా వరలక్ష్మి ఉంటారని, అదే విధంగా సూపర్ సైంటిస్ట్ ఉన్ని ముకుందన్ కూడా ఉంటారని స్పష్టం చేశారు.

సమంత, వరలక్ష్మి, ఉన్ని ముకుందన్ ఉంటే తమకు చాలని, యశోద సినిమాపై ఎన్ని సీక్వెల్స్ అయినా తీస్తామని చెబుతున్నారు ఈ దర్శకుడు. అదే విధంగా తాము ఎన్ని సీక్వెల్స్ తీసినా వాటికి మణిశర్మనే సంగీతం అందిస్తారని కూడా స్పష్టం చేస్తున్నారు. మణిశర్మ లేకపోతే యశోద సినిమా లేదంటున్నారు.

Next Story