Telugu Global
Cinema & Entertainment

లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన దర్శకుడు

దర్శకుడు విజయ్ భాస్కర్ ఎట్టకేలకు ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. గతంలో విజయ్ భాస్కర్ దగ్గర మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్, ఈ కొత్త సినిమా ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.

లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన దర్శకుడు
X

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కె విజయ్ భాస్కర్, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన దర్శకత్వంలో ఎస్ఆర్కే బ్యానర్ పై గుంటూరు రామకృష్ణ ఓ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించనుంది. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో వస్తున్న 13వ చిత్రమిది. మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

గతంలో విజయ్ భాస్కర్ తీసిన సినిమాలకు రైటర్ గా పనిచేశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత త్రివిక్రమ్ స్టార్ డైరక్టర్ అయిపోయాడు. విజయ్ భాస్కర్ కెరీర్ పడిపోయింది. ఇప్పుడీ కొత్త ప్రాజెక్టుకు త్రివిక్రమ్, ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. తన గురువు సినిమాకు క్లాప్ కొట్టాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఈ సినిమాకు మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ లాంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు.




First Published:  7 Oct 2022 2:48 AM GMT
Next Story