Telugu Global
Cinema & Entertainment

Uday Kiran Death Reason: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణమేంటో నాకు తెలుసు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

Uday Kiran Death Reason: ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలు ఏంటో తనకు తెలుసని తేజ చెప్పారు. అయితే ఆ విషయాలు ఇప్పుడు చెప్పడం పద్ధతి కాదని, తాను చనిపోయే లోపు ఆ విషయాలు కచ్చితంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

Uday Kiran Death Reason: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణమేంటో నాకు తెలుసు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు
X

Uday Kiran Death Reason: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణమేంటో నాకు తెలుసు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

హీరో ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం ఏంటో నాకు తెలుసు అని డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల కిందట వరుస విజయాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ఉదయ్ కిరణ్ నటించిన తొలి మూవీ. ఆ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో రెండో సినిమాగా వచ్చిన నువ్వు నేను కూడా సంచలన విజయం సాధించింది. ఇక ఉదయ్ కిరణ్ నటించిన మూడో సినిమా మనసంతా నువ్వే సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

ఇలా వరుసగా మూడు సంచలన విజయాలతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. అయితే కెరీర్‌లో వరుస విజయాలతో ఎంత స్పీడుగా ఎదిగాడో.. అంతే స్పీడ్‌గా వరుస పరాజయాలతో క్రేజ్‌ని కోల్పోయాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వివాహమైన కొన్నేళ్లకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అతడి మరణానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు.

ఉదయ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆయనకు గాడ్ ఫాదర్‌గా నిలిచిన దర్శకుడు తేజ తాజాగా ఉదయ్ కిరణ్ మరణం వెనక గ‌ల‌ కారణం తనకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తేజ అహింస అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్ డం వచ్చినప్పుడు ఎవరైనా బ్యాలెన్స్ మిస్ కావడం మామూలేనని ఉదయ్ కిరణ్ కూడా అలాగే బ్యాలెన్స్ మిస్ అయ్యాడని తేజ అన్నారు. అతడు సమస్యల్లో ఉన్నప్పుడు పిలిచి ఔనన్నా కాదన్నా అనే మూవీ చేశానని చెప్పారు.

ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగిందో తనకు అంతా తెలుసని తేజ తెలిపారు. అతడు అన్ని విషయాలు తనకు చెప్పాడన్నారు. ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలు ఏంటో తనకు తెలుసని తేజ చెప్పారు. అయితే ఆ విషయాలు ఇప్పుడు చెప్పడం పద్ధతి కాదని, తాను చనిపోయే లోపు ఆ విషయాలు కచ్చితంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఉదయ్ కిరణ్ మరణంపై దర్శకుడు తేజ చేసిన సంచల వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

First Published:  18 Nov 2022 9:52 AM GMT
Next Story